“భూభారతి” తో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి..!

ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ అమలు చేసిన పథకాలను కానీ పథకాల పేర్లు కానీ మార్చి కొత్తవాటిని అమలు చేయడం.. పథకాలను తీసేయడం మన ప్రజాస్వామ్య దేశంలో నిరంతర ప్రక్రియ. మరి ముఖ్యంగా తెలంగాణ ఏపీ లో అయితే ఇది సర్వసాధారణం. తాజాగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోచ్చిన ధరణి స్థానంలో భూభారతి అనే పోర్టల్ ను తీసుకోచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది.
కానీ ధరణిని ఎందుకు తీసేశారు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అధికార పక్షం ధరణి అంతా తప్పుతడక. ధరణి వల్ల కొన్ని లక్షల ఎకరాలను కబ్జాకు గురయ్యాయి అని సమాధానమిచ్చింది. అధికార పక్షం చెప్పింది కాసేపు నిజమే అనుకుందాం. మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అదే ధరణి ద్వారా ఇచ్చిన పాసు బుక్కులకు.. రైతుబంధు పేరుతో దాదాపు పన్నెండు విడతలుగా సుమారు ఎనబై వేల కోట్ల రూపాయలను పంట పెట్టుబడి సాయం కింద ప్రతిరైతుకు అందించారు.
మరి ఒకవేళ ధరణి మొత్తం తప్పుల తడక అయితే గ్రామాల్లో పట్టణాల్లో భూముల కోసం రక్తపాతాలు జరగాలి.. రైతులందరూ రోడ్లపైకి రావాలి కదా. మరి అవేమి జరగలేదు. జరగకపోగా ఇటీవల రైతుబంధు సాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే ధరణి ద్వారా ఉన్న రైతులకే ఇచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలు తప్పా.. ధరణి తప్పా అని విశ్లేషకులు.. ప్రతిపక్షాలు.. ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అంటే ధరణిని అమలు చేయడం ఇష్టం లేక కేసీఆర్ అనవాళ్లను చెరిపేస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి ఆ మాటలను నిజం చేసే క్రమంలోనే హాడావుడిగా ఈభూభారతి పోర్టల్ ను తీసుకోచ్చారు . తప్పా ధరణి తప్పుల తడక కాదు. రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికారు అని విమర్శలు వెలువడుతున్నాయి.
