గురువు పై శిష్యుడుదే పైచేయి..?
ఏపీ ముఖ్యమంత్రి ..టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యల బంధం అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ప్రధాన ఆరోపణ.. తన గురువు చంద్రబాబు ఏమి చేబితే .. ఏమి చేయాలో ఆర్డర్ వేస్తే శిష్యుడు రేవంత్ రెడ్డి అది చేస్తాడు.. బాబు చెప్పింది అమలు చేసి తీరుతాడని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.. కాసేపు వీరిద్దర్ని గురు శిష్యులనుకుందాం( ప్రతిపక్షాల మాట ప్రకారం)..
ఏపీ తెలంగాణ రాష్ట్రాలు భారీ వర్షాలతో వరదలతో ఎంతగా నష్టపోయాయో మనకు తెల్సిందే.. తెలంగాణ రాష్ట్రంలోనైతే ఖమ్మం, మహబూబాబాద్,ములుగు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖమ్మం పట్టణం, దంసలాపురం వందల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా.. అంతగా వరదలతో వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది.
మరోవైపు ఏపీలో విజయవాడ,నెల్లూరు,పిఠాపురం ,తదితర ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. మరి ముఖ్యంగా విజయవాడ అయితే వారం రోజులుగా సముద్రంలోనే విజయవాడ ఉన్నదా అన్నట్లు వరదలతో మునిగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబే సాక్షాత్తు అక్కడ ఉండి పునరావాస కార్యక్రమాలను చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు వారం రోజులకు పైగా చంద్రబాబు అక్కడే ఉన్నారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ తెలంగాణలో వరదలతో నష్టపోయిన ఖమ్మంలో ప్రతి ఇంటికి పదహారు వేల ఐదోందలు.. వరదల్లో మృతులకు ఒక్కొక్కర్కి ఐదు లక్షలు.. గొర్రెలు మేకలు చనిపోతే ఒక్కొక్కదానికి ఐదు వేలు.. ఆవులు లేదా గేదెలు మృతి చెందితే యాబై వేల పరిహారం అందిస్తామని ఖమ్మం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రకటించిన తరువాయి నిన్న మంగళవారం నుండి ప్రతి ఇంటికి పదహారు వేలన్నర రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు.
తెలంగాణలో వరదలోస్తే తన శిష్యుడైన రేవంత్ రెడ్డి మాదిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆర్థిక సాయం ప్రకటించలేదు.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు..వరదలకు కారణం వైసీపీ…. జగన్ అని త్రీడీ సినిమా చూపిస్తున్నట్లుగా ఒకటే విమర్షలు తప్పా ఏమి చేశారు వరద బాధితులకు.. ఏమైన అంటే విరాళాలు అందించమని పిలుపునిస్తున్నారు. తెలంగాణలో కూడా విరాళాలు ఇస్తున్నారు. అక్కడ విరాళాలతో ఆగలేదు కదా.. ఏడు లక్షల కోట్ల అప్పులున్న కానీ వరద సాయం ప్రకటించింది. మీరు ఎందుకు ప్రకటించడం లేదు.. మీపై మీ శిష్యుడు వరద బాధితులను ఆదుకోవడంలో పైచేయి సాధించాడు అని ఏపీ ప్రజలు.. రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇప్పటికైన బాబు మేల్కోంటాడేమో చూద్దాం..!