ఫ్యాక్షనిస్టులా రేవంత్ రెడ్డి తీరు..!
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మంచి పనైనా చేశారా అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రశ్నించారు. గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హారీష్ రావు మీడియాతో మాట్లాడారు.
మీడియాతో మాట్లాడుతూ ‘పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సీఎం రేవంత్ ఆదేశాల ప్రకారం పని చేయకూడదు. ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతులను నొక్కాలని ప్రభుత్వం చూస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.
ప్రతిపక్షాల నుంచి సూచనలు తీసుకునే విజ్ఞత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు . చట్టాన్ని వాడుకుని పగతో ఫ్యాక్షనిస్టులా వ్యవహరి స్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యె కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. నన్నూ ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు అని దుయ్యబట్టారు.