కులగణనపై రేవంత్ సర్కారు దూకుడు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి దూకుడు మీద ఉన్నట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా ఫిబ్రవరి నెల రెండో తారీఖున కులగణన నివేదికను సబ్ కమిటీ ఆఫ్ కేబినెట్ కు అధికారులు అందజేయనున్నారు.
ఐదో తారీఖున సమావేశం కానున్న క్యాబినెట్ దానికి ఆమోదం తెలపనున్నారు. అదే నెల ఏడో తారీఖున జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఆ నివేదికను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.