ఆసరా లబ్ధిదారులకు రేవంత్ సర్కారు బిగ్ షాక్..!
గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి .. అప్పటీ పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి వెళ్లిన ప్రతిచోట ఉకదంపుడు ప్రసంగం ” ఇప్పుడు మీరు రెండు వేలే తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి నాలుగు వేలు తీసుకుంటారు అని తన చేతికి ఉన్న ఐదేళ్ళలో నాలుగు వ్రేళ్లు చూపిస్తూ ఓట్లను అడిగారు.
ఈ మాటలను ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న కానీ ఇంతవరకు ఆసరా పింఛన్ల పెంపుపై కనీసం ప్రకటనే కాదు ఊసే లేదు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆసరా పెంపుపై అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియా చిట్ చాట్ లో క్లారిటీచ్చారు.
మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఎన్నికలు ఇంకో ఏడాది ఉండగా ఆసరా పించన్లు పెంచుతాము. రుణమాఫీ చేశాము. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాము. ఆరు గ్యారంటీలను ఒకదాని వెనక ఒకటి అమలు చేస్తున్నాము.. ఆసరా పెంపు కూడా అప్పుడే చేస్తాము అని అన్నారు.