తెలంగాణలో “రియల్ ఎస్టేట్” డౌన్…?
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో నెల కూడా రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో నమోదైన రిజిస్ట్రేషన్లతో పోలిస్తే తాజాగా రూ.140కోట్ల విలువైన రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గాయి. రంగారెడ్డి జిల్లాలోనే రూ.94కోట్లు తగ్గుదల నమోదైంది. కిందటేడాది జరిగిన లావాదేవీలు 91,619. ఈ ఏడాది మాత్రం కేవలం 79,652.
గతేడాదితో పోలిస్తే ఇప్పటికే ఆదాయం విషయంలో రూ.1000కోట్లు వెనకబడి ఉంది అని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ తెలుపుతుంది. మూడు నెలలుగా తగ్గుతున్న ఆదాయంతో తల పట్టుకుంటుంది. వరుసగా రిజిస్ట్రేషన్ల కార్యాకలాపాలు మందగించడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. హైదరాబాద్ పరిధిలో మూసీ ప్రక్షాళన, హైడ్రా వంటి చర్యలతో అమ్మకం దారులు సిద్ధంగా ఉన్న కానీ కొనుగోళ్ళకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.
ఒక్క అక్టోబర్ నెలనే పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాకలాపాలు మందగించాయి. ఆదిలాబాద్ మొదలు హైదరాబాద్ (సౌత్) వరకు పన్నెండు రిజిస్ట్రేషన్ జిల్లాల్లో లావాదేవీల సంఖ్య.. రాబడీ తగ్గింది.గత ఏడాది అక్టోబర్ కంటే ఈఏడాది అక్టోబర్ లో దాదాపు పన్నెండు వేల లావాదేవీలు తగ్గిపోయాయి. అంటే సగటున రోజుకు నాలుగోందల లావాదేవీలు తగ్గాయన్నమాట.గతేడాది అక్టోబర్ లో మొత్తం 91,619రిజిస్ట్రేషన్లు జరగగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో 79,562 డాంక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ కావడం ఇక్కడ గమనార్హం.