కొండా సురేఖకు మాస్ కౌంటరిచ్చిన రవితేజ
హీరోయిన్ సమంత పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై సినీ ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. సినీ రాజకీయ మేధావి వర్గంతో పాటు సామాన్యులు సైతం ముక్తకంఠంతో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
తాజాగా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఘాటుగా స్పందించారు. ” ఓ మహిళా మంత్రి రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచాతి నీచమైన ఆరోపణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.
ఇది భయాందోళనకు గురిచేస్తుంది. అవమానించడం కంటే ఎక్కువ.. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను ముఖ్యంగా రాజకీయ సంబంధం లేని మహిళలను లాగకూడదు. నాయకులనేవారు మంచి చేయకపోయిన పర్వాలేదు.. ముంచకూడదు. నాయకులు సామాజిక విలువలను పెంచాలి.. వాటిని తగ్గించకూడదని వ్యాఖ్యానించారు.