మెగా హీరో కోసం ధోనీ ని మిస్సైన రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా .. చూడముచ్చని సౌందర్యంతో సినీ ప్రేక్షకులతో పాటు యువతను కట్టిపడేసింది. దాదాపు పదేండ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఓ ఊపిన హాట్ బ్యూటీ రకుల్. కథల ఎంపికలో జరిగిన చిన్నతప్పుల వల్ల తన కేరీర్ ప్రమాదంలో పడింది. దీంతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఎంఎస్ ధోనీ మూవీలో దిశ పటేల్ పాత్రను తాను ఎలా మిస్ అయిందో వివరించారు. ఆమె మాట్లాడుతూ “నా వరకూ నా జీవితంలో ఓ కష్టతరమైన దశ ఇది. ఎంఎస్ ధోనీ మూవీకి నేను కథానాయికగా ఎంపికయ్యాను.
దీనికి సంబంధించి స్క్రిప్ట్ రీడింగ్ తదితర పనులన్నీ పూర్తయ్యాయి. కానీ అప్పటికే రామ్ చరణ్ తో కల్సి బ్రూస్ లీ చిత్రంలో పని చేస్తున్నాను . ఇంకా అందులో రెండూ పాటలు చిత్రీకరణ పూర్తి కాలేదు. దీంతో డేట్స్ ను అడ్జెస్ట్ చేసుకోలేక ఈ చిత్రం నుండి తప్పుకున్నాను . ఇంత మంచి సినిమా చేజారిపోయింది అని అమ్మడు ఆవేదనను వ్యక్తం చేశారు.