పుష్ప 2 పై రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా..రష్మిక మందన్నా హీరోయిన్ గా..మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా..సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలయిన మూవీ పుష్ప -2. మంచి హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప-2’ సినిమాపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు.
‘హరికథ’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ కాలం మారుతున్న కొద్దీ హీరోల క్యారెక్టరైజేషన్లో మార్పులొచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈక్రమంలో నిన్న కాక మొన్న చూశాము.
చందనం దొంగ, వాడో హీరో. హీరోల్లో మీనింగ్స్ మారిపోయాయి. సమాజంలో మన చుట్టూ ఉండేవారి క్యారెక్టర్స్తో సినిమాలు తీసి మీ మధ్య ఉన్న నేను 48 ఏళ్లు పూర్తిచేసుకున్నా’ అని ఆయన చెప్పారు.