రేవంత్ కు రాహుల్ నో అపాయింట్మెంట్…!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఇప్పటికి నలబై సార్లు ఢిల్లీకెళ్లారు. ఢిల్లీకెళ్లిన ప్రతిసారి ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా బీజేపీకి చెందిన సీనియర్ నేతలు.. కేంద్ర మంత్రులను కల్సిన ఫోటోలు బయటకు వస్తాయి . తప్పా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి.. లోక్ సభ పక్ష నేత అయిన రాహుల్ గాంధీ తో ఫోటో ఒక్కటి బయటకు రాలేదు.
దీంతో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వార్తలు వైరలవుతాయి . తాజాగా ఈవార్తలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” తెలంగాణ ముఖ్యమంత్రిగా.. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి ఇప్పటికి నలబై సార్లు ఢిల్లీకెళ్లారు.
కానీ ఒక్కసారి కూడా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అఖరికీ ఇటీవల రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన బీసీ గర్జన సభకు సైతం ఆయన రాలేదు. కానీ తెల్లారే మాత్రం ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు. మంత్రి శ్రీధర్ బాబును రాహుల్ గాంధీ కలుస్తారు. రేవంత్ రెడ్డిని మాత్రం తన ఇంటి ఛాయల్లోకి రానీవ్వడం లేదు. మనం చేసే పనులను బట్టే మన పార్టీ నేతలు మనకు విలువ ఇస్తారని హేద్దేవా చేశారు.
