రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీకి పిర్యాదుల వెల్లువ..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కులగణన పై సమీక్ష కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అగ్రనేత.. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పిర్యాదుల వెల్లువ కొనసాగిందని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకోస్తాడని.. అధికార స్థిరత్వాన్ని నిలబెడతాడని ఆశించి పార్టీలో ఎంతోమంది సీనియర్లను కాదని ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే కేసీఆర్ & బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సహాజమే అయిన కానీ రేవంత్ రెడ్డి మాత్రం మరి వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. ముందు కాళేశ్వరం అవినీతి అన్నాడు.విద్యుత్ కుంభకోణం అన్నాడు.. మిషన్ భగీరథ అన్నాడు. ఇలా రోజుకో అంశాన్ని మంత్రివర్గంలో.. పార్టీలో తనకు అనుకూలమైన వాళ్లతో మీడియా లీకేజులు ఇప్పించడం.. దానిపై మీడియాలో చర్చ జరిగేలా చూడటం తప్పా హమీల అమలుపై దృష్టిసారించడం లేదు.. సీనియర్లమైన మేము ఎంత చెప్పిన వినకుండా హైడ్రాతో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని నామారూపాలే లేకుండా చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు కన్పిస్తున్నాయి.
రైతుబంధు, రుణమాఫీపై అసంపూర్ణ వ్యాఖ్యలు చేయిస్తూ ఇటు పార్టీపై అటు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నాడు. మేము ఏమైన చెబితే నాకంటే ఎక్కువగా తెలుసా.. ఒక్కసారి మంత్రులుగా పని చేయనోళ్ళు నాకు చెప్పేంత స్థాయినా అని మమ్మల్ని అవమానించేలా ప్రవర్తిస్తున్నాడు. మాకు ఎన్ని అవమానాలు. హేళనలు ఎదురైన భరిస్తూ వస్తున్నాము. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను స్థానిక నాయకత్వంతో సంబంధంలేకుండా.. ఎలాంటి సంప్రదింపులు చేయకుండా చేర్చుకుని నిఖార్సైన కాంగ్రెస్ క్యాడర్ కు అన్యాయం జరిగేలా అతని చర్యలు ఉన్నాయి.
ఇప్పటికైన తగిన సూచనలు సలహాలు చెప్పాలి.. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలను ఆపకపోతే పార్టీకే నష్టం అని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు. మంత్రులు రాహుల్ గాంధీకి పిర్యాదు చేసినట్లు గాంధీ భవన్ టాక్. ఇప్పటికే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వార్తలు విన్పిస్తోన్న తరుణంలో తాజాగా ఈ వార్తలు మున్ముందు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి మరి..?