KTR కు MP రఘునందన్ కౌంటర్
జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడంపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.
ఆయన మాట్లాడుతూ ‘గతంలో జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్లు ఎగరవేశారని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారు.
మరి ఫామ్ హౌస్ నీది కాదని అప్పుడే ఎందుకు చెప్పలేదు కేటీఆర్. ఇప్పుడెందుకీ సన్నాయి నొక్కులు?’ అని ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు.