జానీ మాస్టర్ పై అత్యాచార కేసు నమోదు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్.. ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ పై అత్యాచార కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.
తనను లైంగిక వేధింపులకు దిగడమే కాకుండా నన్ను శారీరకంగా హింసించాడని జూనియర్ డాన్సర్ రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. యువతి పిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు.
సదరు యువతిని నార్సింగ్ లోని జానీ మాస్టర్ నివాసంలో సైతం లైంగిక దాడి చేయడమే కాకుండా కొట్టాడని ఆమె పిర్యాదులో పేర్కొన్నది. రాయదుర్గ పీఎస్ లో కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు నార్సింగ్ పీఎస్ కు తరలించారు. ఈ కేసుపై వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.