పబ్లిసిటీ సరే..! జనం గోస పట్టదా…?
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుండి నేటీ వరకు అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అంటే హోర్డింగ్స్.. ఊ అంటే హోర్డింగ్స్.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిసిటీకి అడ్డే లేదు.. ఒక్కముక్కలో చెప్పాలంటే చేసేది తక్కువ.. పబ్లిసిటీ చేసుకునేది ఎక్కువ అని ఇటు ప్రతిపక్షం.. అటు నెటిజన్ల నుండి విమర్శల వర్షం కురుస్తుంది. అయిన కానీ అవన్నీ మాకు పట్టనట్లు పబ్లిసిటీ స్టంట్లతో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి..
రుణమాఫీ దగ్గర నుండి నిన్నటి ఏఈఈ ఉద్యోగాల భర్తీ వరకు పబ్లిసిటీ స్టంట్లు అంతా ఇంతా కాదు. నెలకు ఇస్తామన్న ఆసరా నాలుగు వేల ఊసే లేదు.. మహిళలకు ఇస్తామన్నా రెండున్నర వేల అడ్రసే లేదు.. రైతుబంధు కు దిక్కే లేదు.. కళ్యాణ లక్ష్మీతో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం లేదు.. అఖర్కి ఎంతోగొప్పగా చెప్పుకుంటున్న రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి.. మంత్రులతో సహా రోజుకో పాట పాడుతున్నారు. ముఖ్యమంత్రేమో రుణమాఫీ అయిందంటారు ఒకసారి.
ఇంకొకసారి ఏమో డిసెంబర్ తొమ్మిదిన సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా పూర్తిగా చేస్తామని చెబుతుంటారు. ఉచిత కరెంటు లేదు.. ఐదోందలకు గ్యాస్ సిలిండర్ లేదు. ఇలా ఒక్కటేమిటి ఆరు గ్యారంటీల్లో ఓ ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు చేయలేదు.. పబ్లిసిటీ స్టంట్లతో ఆరోజు మీడియాలో వార్తలై వస్తాయి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతాయి కానీ క్షేత్రస్థాయిలో పథకాల అమలు ప్రజలకు ఆర్ధమవుతుంది కదా.. ఏ పథకం ఎంతవరకూ వచ్చింది..
ఏ పథకం మాకు అందుతుంది అని కనీసం ఆలోచించకుండా ఈరోజుల్లో ఎవరూ ఉండరు. అది సామాన్యుడైన.. సెలబ్రేటీ అయిన.. ఇప్పటికైన పబ్లిసిటీ స్టంట్లపైనే కాకుండా జనం గోస కూడా తెలుసుకుని ముందుకెళ్తే వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయిన కట్టబెడ్తారు.. లేదంటే పక్క రాష్ట్రంలో అధికార పార్టీకి ఏమి చేశారో ఇక్కడ అదే చేస్తారు.. ఈరోజుల్లో రాజకీయ నాయకులకంటే.. మేధావుల కంటే ఓటరు చాలా తెలివైనోడు అన్న సంగతి మరిచిపోవద్దు.