సంచలనానికి కేంద్రబిందువైన మంత్రి సురేఖ
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది.
కొల్చారం మండల కేంద్రంలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజి రెడ్డితో ప్రారంభం చేయించాలని చూసిన మంత్రి కొండా సురేఖ.. స్థానిక ఎమ్మెల్యే తాను ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అడ్డుపడ్డారు.