RRR కు ప్రమోషన్…?

Raghurama Krishna Raju As Deputy Speaker Of Ap Assembly
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరిన రఘురామ కృష్ణం రాజుకు కూటమి ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన్ని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా నియమిస్తున్నట్లు కూటమి ప్రభుత్వాధినేత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
డిప్యూటీ స్పీకర్ పదవికోసం పలువురి ఎమ్మెల్యేల పేర్లను పరిశీలించిన అఖరికి ఆర్ఆర్ఆర్ ను చంద్రబాబు ఖరారు చేశారు. మరోవైపు ఈ పోస్టుకు ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో రఘురామకృష్ణం రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
