నిర్మాత నాగవంశీ వివాదస్పద వ్యాఖ్యలు

 నిర్మాత నాగవంశీ వివాదస్పద వ్యాఖ్యలు

Suryadevara Naga Vamsi Film producer

Loading

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత నాగవంశీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ ” ఓ సినిమాకు రూ.1500లు ఖర్చు పెట్టలేరా అని ప్రేక్షకులను ఉద్ధేశిస్తూ అవమానించేలా వ్యాఖ్యానించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో నలుగురు సభ్యులుంటారు. ఒక సినిమాపై పదిహేను వందలు ఖర్చు చేయడం పెద్ద సమస్య కాదు. ఈ డబ్బులకు మూడు గంటల ఎంటర్ ట్రైన్మెంట్ మరెక్కడా దొరకదని చెప్పారు.

సినిమా టికెట్ ధరలు కరెక్ట్ గానే ఉన్నాయి. మేమేం ప్రేక్షకుల నుండి దోపిడీ చేయడం లేదు. అదే షాపింగ్ మాల్ కెళ్తే ఇంతకంటే ఎక్కువే ఖర్చు అవుతుంది. నా దృష్టిలో మూడు గంటల ఎంటర్ ట్రైన్మెంట్ కు రూ పదిహేను వందలు తక్కువే అని మరోసారి ఉద్ఘాటించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *