ప్రధాని మోదీ బీసీ కాదా..?

Modi’s visit to Visakha today..!
సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమమ్త్రి నరేందర్ మోదీ అసలైన బీసీ కులానికి చెందినవాడు కాదని ఆరోపించారు. గాంధీభవన్ లో జరిగిన యూత్ కమిటీ ప్రమాణ స్వీకారమహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా పార్టీ నాయకులు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ మెడలు వంచుతారనే కుల గణనపై బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు.
“అసలు ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కానేకాదు.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ఆయన పుట్టుకతోనే ఉన్నత కులం. 2001లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు. 2002 వరకు మోదీది ఉన్నత వర్గమే. ఆయన గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో కలిపారు. అన్నీ తెలుసుకునే మోడీ కులం గురించి మాట్లాడుతున్నాను అని అన్నారు..
మోడీ బీసీ అయితే, ఇన్నాళ్లు కులగణన ఎందుకు చేయలేదు. చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణనను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ లెక్కలను తప్పుపడితే నష్టపోయేది బీసీలే. వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మేము ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేస్తే దాన్ని కూడా తప్పుపట్టాలని చూస్తున్నారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దు అని హితవు పలికారు.
