భార్య హత్యకు ప్రాక్టీస్.. కుక్కతో అలా..?
ఇటివల భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే..భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను చంపి ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి అనంతరం చెరువులో పడేసిన సంగతి ఇటివల సంచలనంగా మారింది.
అయితే ఈ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.భర్త గురుమూర్తి.. వెంకటమాధవిని చంపిన ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. దీనికోసం మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్లో ఉడికించాడు..
ఎముకలను కాల్చి దంచి పొడి చేశాడు.. వీటన్నింటినీ కవర్లలో కట్టి డ్రైనేజీల్లో, చెరువులో పడేశాడు..భార్యను చంపడానికి ముందు అతడు ప్రాక్టీస్ చేసాడని తెలుస్తుంది.పక్కా ప్లాన్ ప్రకారం యూట్యూబ్ లో చూసి సాదన మొదలెట్టాడు..ప్రాక్టీస్ కోసం కుక్కను ఉపయోగించి కుక్కను చంపినట్లు తెలుస్తోంది.అనంతరం తన భార్యను చంపినట్టు విస్తుపోయే నిజాలు భయటకి వస్తున్నాయి.