ఆ తప్పు ఇక చేయను..?

Pooja Hegde
పూజా హెగ్డే చూడటానికి ఎత్తుగా.. చూడగానే మత్తెక్కించే సోయగంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే బుట్టబొమ్మ. మొదట్లో హీరోలకు.. నిర్మాతలకు గోల్డెన్ లెగ్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథల ఎంపికలో తడబాటుతో ఐరాన్ లెగ్ గా మారిందని సినీ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తుంటారు.
ఇదే అంశంపై బుట్టబొమ్మ మాట్లాడుతూ కథాంశాల ఎంపికలో గతంలో తాను చేసిన తప్పులను ఇకముందు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. రాబోయే ఏడాదిలో వైవిధ్యమైన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను చెప్పింది. మరోవైపు గత కొంతకాలంగా ఈ హాట్ బ్యూటీకి కాలం కల్సి రావడం లేదు .
సౌత్ తో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ అమ్మడుకు హిట్లు దక్కడం లేదు. తాజాగా అమ్మడు తీసుకున్న నిర్ణయంతోనైన వచ్చేడాది నుండి హిట్ పలకరిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్, సూర్య మూవీల్లో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని తమిళ ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి.
