సీఎం రేవంత్ కి ప్రధాని మోదీ ఫోన్

 సీఎం రేవంత్ కి ప్రధాని మోదీ ఫోన్

Modi With Revanth Reddy

Loading

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం రేవంత్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.. తక్షణ సహాయక చర్యలు చేపట్టాము.. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తాము.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సేవలు అందించే హెలికాప్టర్లను తెలంగాణకు పంపిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోదీ అభినందించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *