ప్లీజ్ పాలు తాగే పిల్లాడున్నాడు.. వదిలేయండి..?
తెలంగాణ రాష్ట్ర బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న బెటాలియన్ పోలీసుల కుటుంబీకులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాలకు తరలిస్తున్నారు.
ఈక్రమంలోనే ఓ మహిళను అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కించారు. దీంతో ఆమె ‘నాకు పాలు తాగే చిన్న బాబు ఉన్నాడు.. వదిలేయండి ప్లీజ్’ అని వేడుకున్నారు.
అక్కడున్న మీడియా సిబ్బంది కూడా ఆమెను వదిలేయాలని కోరారు. అయినా పోలీసులు వినకుండా ఆమెను వ్యానులో తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.