కుప్పంలో ‘జన నాయకుడు’ కేంద్రం..!
ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించారు.
నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకుని వినతి పత్రాలు సమర్పించేందుకు వీలుగా ఈ ‘జన నాయకుడు’ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమస్యలు, ఫిర్యాదులను ‘జన నాయకుడు’ పోర్టల్‌లో రిజిస్టర్ చేసేలా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు.
ప్రజల ఫిర్యాదులను తీసుకుని, ఏ విధంగా ఆన్‌లైన్ చేసి ట్రాక్ చేస్తారనే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు అందుకుని సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.