ముంబై కి షాక్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఐపీఎల్ సీజన్ -2025లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు పంజాబ్ సూపర్ కింగ్స్ బిగ్ షాకిచ్చింది. ఈరోజు సాయంత్రం ముంబైతో జరిగిన కీలక మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది.
ముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగా ఛేదించింది. పంజాబ్ ఆటగాళ్లల్లో ప్రియాంశ్ ఆర్య 62, ఇంగ్లిస్ 73 చెలరేగడంతో ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.
దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ క్వాలిఫయర్-1 ఆడనుంది. మరోవైపు ఈ మ్యాచ్ ఓటమితో టాప్-2 రేస్ నుంచి తప్పుకున్న ముంబై ఎలిమినేటర్ ఆడనుంది.