హైడ్రా పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు ..?

Pawan Kalyan Ap Deputy CM
ఏపీ డిప్యూటీ సీఎం ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైడ్రా గురించి గతంలో మాట్లాడుతూ ” హైడ్రా మంచి వ్యవస్థ.. అక్రమణలకు గురైన చెరువులను.. విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ బాగుంది. హైదరాబాద్ లో ఉన్న ఈ వ్యవస్థ పని తీరు నచ్చింది.
ఏపీలో కూడా ఈ వ్యవస్థను తీసుకోస్తాము. హైడ్రాను తీసుకోచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి నా అభినందనలు ” అని పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాకుండా హైడ్రా వలన అక్రమణలకు గురైన చెరువులు,భూములు ప్రభుత్వ పరిధిలోకివస్తాయి. ప్రజల సొమ్ము తిరిగి ప్రజల వద్దకు చేరుతుంది. హైదరాబాద్ త్వరలోనే వరదల ఫ్రీ నగరం అవుతుంది అని అన్నారు.
తాజాగా హైడ్రా గురించి పవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకోచ్చినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలి.. హైడ్రా వల్ల కూల్చి వేతలు మొదలు పెట్టే ముందు బాధితులకు పునరావాస కార్యక్రమాలను అమలు చేసి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం తీసుకోచ్చే ఏ వ్యవస్థ వలన అయిన సరే ప్రజలకు లబ్ధి చేకూరాలి తప్పా అన్యాయం జరగకూడదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
