జగన్ కు పవన్ కళ్యాణ్ కౌంటర్..!

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం పదో కోండో వార్శికోత్సవ వేడుకల్లో జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఓ రాజకీయ పార్టీ పెట్టాలంటే తండ్రి సీఎం కావాల్నా..?. మావయ్య కేంద్ర మంత్రి అవ్వాల్నా..?. బాబాయిని మర్డర్ చేయించాల్నా అని ప్రశ్నించారు.
నేను రాజకీయాల్లోకి పదవుల కోసమో. ఓట్ల కోసమో రాలేదు. ప్రజలకోసం వచ్చాను. అందుకే 2018లో పెద్ద పోరాట యాత్రనే చేశాను. ఓటమి అంటే భయం లేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేశాను.
ఓటమి ఎదురైన నెరవకుండా ఆ అతర్వాత జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేసి వందకు వందశాతం స్ట్రైక్ రేటు సాధించాము అని ఆయన అన్నారు. 2014లో ఒక్కడ్నే బయలుదేరాను. ఈరోజు ఇంతమంది ఉన్నారు. ఈ స్థాయికి నేను ఎదిగాను. జనసేన పదకోండో వార్శికోత్సవం వైసీపీకి అంకితం చేస్తున్నాను అని కౌంటర్ ఇచ్చారు.