పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తోప్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కటౌటును 35MM స్క్రీన్ పై చూస్తే చాలు… సిల్వర్ స్క్రీన్ పై ఆయన బొమ్మను చూస్తే చాలు ఆయన నటించిన సినిమా విడుదల రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. దాదాపు పదేండ్ల పాటు ఎలాంటి హిట్ సినిమా కాదు కనీసం యావరేజ్ మూవీ కూడా లేకపోయిన కానీ ఇంతింతై వటుడింతయై అన్నట్లు ఆయనకు అభిమాన సంద్రం పెరిగిందే తప్పా తగ్గలేదు.. ఖుషీ మూవీ తర్వాత ఆ రేంజ్ లో హిట్ అందిన మూవీ జల్సా..
జల్సా తర్వాత అంతకుమించి హిట్ ను అందించిన మూవీ గబ్బర్ సింగ్.. దీని తర్వాత పవన్ మ్యానియా ఏంటో మనకు కండ్ల ముందు కన్పించిందే.. మొదటిసారి ఎన్నికల్లో బరిలోకి దిగిన సమయంలో రెండు చోట్ల ఓటమి పాలైన జనసేనాని తర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడాటానికి తానే కారణం అని ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ పబ్లిక్ మీటింగ్ లో చెప్పేస్థాయికి ఎదిగారు .
ఇటీవల డిప్యూటీ సీఎంగా పీడబ్ల్యూ శాఖ మంత్రిగా పదవిబాధ్యతలు స్వీకరించిన జనసేనాని తనదైన శైలీలో దూసుకెళ్తున్నారు. గత నెల ఇరవై మూడో తారీఖున ఒకే రోజు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మొత్తం 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ రికార్డును సృష్టించారు. ఇదే అంశం గురించి వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తించి పవన్ కళ్యాణ్ ను సత్కరించింది. మావోడు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం రికార్డులను సృష్టిస్తున్నాడని ఫ్యాన్స్ కాలర్ ఎగురవేస్తున్నారు.