పుష్ప -2 లో ఒకటి మిస్ అయింది..?
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ పుష్ప -2. ప్రస్తుతం ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.
దీంతో పుష్ప -2 సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఏడాది కిందట ‘WHERE IS PUSHPA’ అంటూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ సీక్వెన్స్ వీడియోలు సినిమాలో ఎక్కడా కనిపించలేదు.
దీంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లోకి తప్పించుకుపోయిన పుష్పను చూసి పెద్ద పులి రెండడుగులు వెనక్కి వేసిన సీనను చిత్రంలో పెట్టి ఉంటే అదిరిపోయేదని చెబుతున్నారు.