ఒకప్పుడు మూసీ నది నీళ్లు తాగేవాళ్లా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణకు సిద్ధమైన సంగతి తెల్సిందే. మూసీ నది సుందరీకరణ పనుల్లో భాగంగా హైడ్రా పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్నారు. పేదలను రోడ్లపైకి తీసుకోచ్చి సుందరీకరణ పనులు చేయద్దు అని ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు.. బాధితులు పోరాడుతున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సదర్ పండుగ వేడుకల గురించి పోస్టర్ ను ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” మూసీ సుందరీకరణ చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది చేస్తున్న మంచి పని..
మనమంతా మద్ధతుగా నిలవాలి.. మూసీ నదితో మాకు విడదీయరాని బంధం ఉంది.. హైదరాబాద్ లో ఒకప్పుడు గేదెలు.. ఆవులు.. పశువులన్నీ మూసీ నది నీళ్లే తాగేవి. అప్పుడు అంత మంచిగా ఉండేవి.. ఆ తర్వాత కబ్జా వల్ల గేదేలకు.. పశువులకు తాగునీళ్లే కాదు మేత కూడా కరువైంది. పక్క జిల్లాల నుండి తీసుకురావాల్సి