రాంగోపాల్ వర్మకు మరోసారి నోటీసులు
ప్రముఖ వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు మరోసారి ఒంగోలు రూరల్ సీఐ నోటీసులు అందజేశారు.. అందులో భాగంగా ఈ నెల 25న పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు..
అంతకుముందే దర్శకుడు ఆర్జీవీ వాట్సాప్ నెంబర్‌కు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసు పంపారు.. నిన్న విచారణకు హాజరుకాకుండా వారం రోజులు గడువు ను రాంగోపాల్ వర్మ కోరారు.
గతంలో రాం గోపాల్ వర్మ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.