హీరోయిన్ గా బ్రాహ్మణికి ఆఫర్..!
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కోడలు.. ఆయన తనయుడైన మంత్రి.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నాయుడు సతీమణి అయిన నారా బ్రాహ్మాణి కు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని బ్రాహ్మాణి తండ్రి.. స్టార్ హీరో .. హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.
అయితే అది ఇప్పుడు కాదంట. ఓ షో లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ అడిగిన ప్రశ్నకు హీరో బాలయ్య సమాధానమిస్తూ అప్పట్లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ సినిమా కోసం తన కుమార్తె బ్రాహ్మాణి కి హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చారని ఆయన అన్నారు.
కానీ బ్రాహ్మాణి ఆ ఆఫర్ ను వద్దనుకున్నారని కూడా తెలియజేశాడు. ఇద్దరూ కూతురులైన బ్రాహ్మాణి , తేజస్విని ఎంతో గారాబంగా పెంచాను. ఎవరి రంగంలో వారు మంచి పేరు తెచ్చుకున్నారు అని ఆయన అన్నారు.