బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు.

RMPs and PMPs should not use the word “doctor”.
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి మాల్ కు ఫైనాన్స్ కార్పోరేషన్ ఆధికారులు మరోకసారి నోటీసులు జారీ చేశారు.
ఆర్మూర్ ఆర్టీసీ డిపోకి చెందిన స్థలంలో నిర్మించిన పలు వ్యాపార సముదాయంలో బకాయిలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కార్పోరేషన్ రంగంలోకి దిగి మొత్తం రూ.45.46కోట్ల బకాయిలను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కోన్నది.
గతంలోనూ షాపింగ్ మాల్ అద్దెని గత కొంత కాలంగా కట్టకుండా ఎగ్గొడుతున్నాడు. సుమారుగా రూ.7.50 కోట్ల అద్దె బకాయిలు చెల్లించాలని నోటీసులు అందిన సంగతి తెల్సిందే.
