ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై కీలక ప్రకటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈ దీపావళి పండుగ రోజు నుండి అమలు చేయనున్న సంగతి తెల్సిందే.
అందులో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.. రేషన్ కార్డు ఉన్న అందరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులేనని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం ‘1.50 కోట్ల మంది అర్హులున్నారు. రేషన్ కార్డు-ఆధార్-LPG లింక్ చేసుకున్న వారు ఉచిత గ్యాస్ కోసం బుక్ చేసుకోవచ్చు.
గ్యాస్ డెలివరీ అయిన 24-48 గంటల్లో ప్రజల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దు. సందేహాలుంటే 1967 నంబర్కు ఫోన్ చేయండి’ అని ఆయన సూచించారు.
