నాలుకే కాదు మెదడు కూడా వాడాలి ..?
నాలుక ఉంది కదా అని నలబై మాట్లాడితే దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పెద్దలు అప్పుడప్పుడు హెచ్చరిస్తుంటారు.అలాంటిది మాట్లాడే ముందు వెనక ముందు అన్ని ఆలోచించి మాట్లాడాలి.. మనం ఏమి మాట్లాడిన కానీ దానికో ఆధారం ఉండాలి.. నిబద్ధత ఉండాలి. అవేమి లేకుండా నోరు ఉంది కదా అని మాటలు జారితే ఆ మాటలను చరిత్రలో నుండి తీసేయడం చాలా కష్టం.. సామాన్యులు మాట్లాడితే ఎవరూ అంతగా పట్టించుకోరు. అదే సెలబ్రేటీలు మాట్లాడితే మాత్రం అవే నిజాలు అని గల్లీలో ఉండే ఊహ తెల్సిన పోరడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందరూ నమ్మేస్తారు.. అలాంటి మాటలను మాట్లాడిన కొందరి సెలబ్రేటీలను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుందాము.
దివంగత నటుడు శోభన్ బాబు మృతి గురించి సీనియర్ నటుడు బాబు మోహాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి అదే నిజం అని అనుకుంటారు అంతా.. శోభన్ బాబు తనయుడు తోయడం వల్లనే ఆయన కింద పడి చనిపోయారు అని ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆ మాటలను విన్నవారంతా బాబు మోహాన్ సినీ నటుడు కాబట్టి ఆయన ఎక్కడో విని ఉంటారు. ఎవరో చెప్పి ఉంటరని నమ్మి ఉంటారు అప్పట్లో. ఆ తర్వాత ఆయన అదేదో పోరపాటుగా అన్నానని ఆ తప్పును సరిదిద్దుకున్న కానీ అది మాయని మచ్చగా నిలిచిపోయింది. ఆ సందర్భంలో బాబు మోహాన్ ఎవర్ని టార్గెట్ కూడా చేయలేదు.
నిన్న కాక మొన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగా మీడియా సమావేశం పెట్టి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కల్సింది అని ఆరోపించారు. ఎలాంటి ఆధారాల్లేకుండా మీడియా సమావేశంలో ఎలా చెప్తారు… దానిపై సెకండ్ ఓపినియన్ తీసుకున్నారా..?. నివేదికలు ఏవి అని దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ప్రశ్నించి.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కమిటీని రద్ధు చేసి సీబీఐ కమిటీని వేసింది. ఇక్కడ మాట్లాడిన బాబు బాగున్నారు.. ఆదేశాలిచ్చిన సుప్రీం కోర్టు బాగానే ఉంది. కానీ దెబ్బ తిన్నది మాత్రం కోట్లాది మంది హిందువుల మనోభావాలు..
ఆయన చూపిన బాటలోనే నడిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా ఆయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి లక్ష తిరుపతి లడ్లును పంపారు. అందులో కూడా కలిపారు అని బాంబు పేల్చారు. అయిటే ఆయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరిగింది జనవరి మాసం.. ఏఆర్ డెయిరీ నెయ్యిని సప్లై చేసింది ఏఫ్రిల్ నుండి. మరి అప్పుడేలా జరిగింది కల్తీ .. అంటే మాట్లాడే ముందు జనసేనాని వాస్తవాలతో సంబంధం లేకుండా మాట్లాడారన్నమాట.
తాజాగా దేశ రాజకీయాలనే షేక్ చేస్తున్న మరో సంచలనం తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు.. ఆమె చేసిన వ్యాఖ్యలతో ఇంట బయట సదరు మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఖరికి మంత్రి పదవి నుండీ తీసేయాలని డిమాండ్ కూడా విన్పిస్తుంది. కానీ ఈ వ్యాఖ్యల వల్ల బాధపడేది ఎవరూ సదరు హీరోయిన్ కుటుంబం.. హీరో కుటుంబ సభ్యులు .. ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఆ మాటలు చరిత్రలో నిలిచిపోతాయి తప్పా మాట్లాడిన రోజునో… ఆ క్షణానో విని ఎవరూ మరిచిపోరు.. జీవితాంతం ఆ మాటలను గుర్తు పెట్టుకుంటరు. ఆ వ్యాఖ్యల వలన కలిగే మానసిక క్షోభను గుర్తుంచుకుంటారు. సామాన్యులు ఏమి మాట్లాడిన ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే సెలబ్రేటీలు మాట్లాడితే మాత్రం వాటి ప్రభావం చాలా ఉంటుంది. అవి చరిత్రలో అలా మిగిలిపోతాయి.