ఇడ్లీ కొట్టుతో నిత్యా మీనన్ సరికొత్త ప్రయాణం…?

Nithya Menen
తాను ఎంచుకునే ప్రతి పాత్ర.. కథ చాలా సహాజంగా.. నేచూరల్ గా ఉంటుంది. తనకే సాధ్యమైన సహాజ నటనతో సినీ ప్రేక్షకుల మదిని దోచుకుంది ఆ సుందరీ.. ఇప్పటివరకు తాను నటించిన ప్రతి సినిమాలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్యూటీ నిత్యామీనన్.
తాజాగా ఇడ్లీకొట్టు అనే మూవీతో సరికొత్త ప్రయాణం మొదలెడుతుంది ఈ హాట్ బ్యూటీ. తమిళ నటుడు ధనుష్ తో ఈ చిత్రంలో నటిస్తుంది. ఈ విషయం గురించి ప్రకటన చేస్తూ కొత్త ప్రకటన.. కొత్త ప్రయాణం.. ఇడ్లీ కడై అనే వ్యాఖ్యతో సామాజిక మాధ్యమాల్లో ఓ ఫోటోను షేర్ చేసింది నిత్యా మీనన్.
డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్,షాలీని పాండే, తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రం మేకర్స్ చెబుతున్నారు.
