రేషన్ కార్డుల జారీకి అర్హతలు ఇవే

 రేషన్ కార్డుల జారీకి అర్హతలు ఇవే

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సబ్ కమిటీ నిర్ణయించింది .

గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50ఎకరాలు, చెలక 7.5ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2లక్షలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేయాలని సబ్ కమిటీ ప్రతిపాదించింది. 

మరివైపు రెండు రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఓ ఆప్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల,ఎంపీల సూచనలను సబ్ కమిటీ తీసుకోనుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *