మంత్రుల సియోల్ పర్యటనపై నెటిజన్లు ట్రోలింగ్

 మంత్రుల సియోల్ పర్యటనపై నెటిజన్లు ట్రోలింగ్

Netizens trolling ministers’ visit to Seoul

Loading

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు హౌజింగ్, ఐఎన్పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మేయరు గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య ,మల్ రెడ్డి రంగారెడ్డి బృందం సియోల్ పర్యటనకెళ్లిన సంగతి తెల్సిందే.

సియోల్ లో ఉన్న హాన్ నది ప్రక్షాళన సుందరీకరణ పనులపై అధ్యయనానికి వెళ్లారు. సియోల్ పర్యటనలో భాగంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. నేతలు ఆయా ప్రదేశాల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీరు వెళ్లింది సియోల్ లో ఉన్న హాన్ నది ప్రక్షాళన.. సుందరీకరణ పనులపై అధ్యయనానికా.. ఫోటోల షూట్ కోసమా అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మరికొంతమంది ఓ చిన్న పిల్ల కాలువ కోసమా మీరు వెళ్లింది. హైదరాబాద్ పక్కన ఉన్న కోమటిచెరువు సిద్ధిపేట ను పర్యటిస్తే సరిపోతుంది అని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది సియోల్ నది పక్కన ఉన్న ఇండ్లను కూల్చకుండా ఎలా సుందరీకరణ చేశారో తెలుసుకుని రావాలని సూచిస్తున్నారు. మొత్తం మీద సియోల్ మంత్రుల పర్యటనపై నెటిజన్లు తమదైన శైలీలో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *