జగ్గారెడ్డిపై నెటిజన్లు ట్రోలింగ్..?
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… వర్కింగ్ ప్రెసిడెంట్ .. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ (Foxconn) కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కంపెనీ విస్తరణ.. ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో మంత్రులు.. స్థానిక ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు పాల్గోన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అసలు సమస్య వచ్చింది. అదే ఈ భేటీలో ఎలాంటి సంబంధం లేని జగ్గారెడ్డి పాల్గోనడం.. జగ్గారెడ్డి పాల్గోనడానికి ఆయన ఏమి ఎమ్మెల్యే కాదు..
పోనీ ఐటీ సంస్థ చైర్మన్ కాదు. ఆయన సతీమణి శ్రీమతి నిర్మల టిస్క్ చైర్ పర్శన్. హాజరైతే వారు హజరు కావాలి కానీ ఏలాంటి హోదా లేని జగ్గారెడ్డి ఎలా హజరవుతారు.. ఏ హోదాలో ఈ అధికారిక సమావేశంలో జగ్గారెడ్డి గారు పాల్గొన్నారు .వారి సతీమణి TSIIC చైర్పర్సన్ శ్రీమతి నిర్మల గారి బదులు ఈ సమావేశంలో కూర్చున్నారా .దీనిని మహిళా సమాజం ఒప్పుకుంటుందా అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.