మాజీ మంత్రి దారుణ హత్య….?

Good news for those with ration cards..!
మహారాష్ట్ర కు చెందిన మాజీ మంత్రి… ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలో బాబాపై గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో గాయపడిన ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు.
తరలించిన అనంతరం వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్,షారుఖ్ ఖాన్ ల మధ్య అప్పట్లో సయోధ్య కుదిర్చి బాబా ఫేమస్ అయ్యారు.
