తెలంగాణ మంత్రులపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

CPI NARAYANA
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రులపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ నారాయణ ‘ తెలంగాణలో రాజకీయాలు అందాల భామల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన మంత్రులు, అధికారులు పాలనను, ప్రజలను గాలికి వదిలేసి ఆ అందాల భామలను చూస్తూ సొల్లు కార్చుకుంటూ వారివెంట తిరుగుతున్నారని’ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ’ అందాల పోటీల నిర్వాహణ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రైతుల కోసం పది పైసలు కూడా ఖర్చు చేయడం లేదు. రైతులు పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసి కల్లాల్లో అలాగే ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు మాత్రం అందాల భామల వెంట తిరుగుతున్నారు. ఆ పోటీల వలన ప్రజలకు ఏమి లాభం. కార్పోరేట్ వ్యక్తులకే కదా లాభం’ అని ఆరోపించారు.