మిస్టరీ స్పిన్నర్ రిటర్న్..!
ఇంగ్లండ్ జట్టుతో ఈ నెల 6న ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు టీమిండియాకు చెందిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ సెలక్ట్ చేసింది.
మొత్తం 15మందితో జట్టును ఇప్పటికే ప్రకటించింది. తాజాగా 16వ ప్లేయర్ యాడ్ అయ్యారు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ లో వరుణ్ 7.66 రన్ రేటుతో 14 వికెట్లు తీశారు.
ఫామ్లో ఉన్న వరుణ్ ఈ సిరీస్లో రాణిస్తే ఛాంపియన్ ట్రోపీకి సైతం ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు చక్రవర్తిని ఛాంపియన్ ట్రోపీకి ఎంపిక చేయాలని సీనియర్ ప్లేయర్లు సూచించిన విషయం తెలిసిందే.