ఉత్తరాంధ్ర వైసీపీలో ముసలం…?
ఉత్తరాంధ్ర వైసీపీలో ముసలం మొదలైందా..?. బుధవారం వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన పార్టీ కోఆర్టినేటర్ల నియామక ప్రకటనతో ఉత్తరాంధ్ర వైసీపీలో అలజడి పుట్టిందా ..?. అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్టినేటర్ గా ఎంపీ.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత విజయసాయి రెడ్డిని జగన్మోహాన్ రెడ్డి నియమించారు.
అధికారంలో ఉన్న సమయంలో కోఆర్టినేటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి అప్పట్లో టీడీపీ సీనియర్ నేత అశోక గజపతిరాజు పట్ల వ్యవహరించిన తీరుతో ఉత్తరాంధ్ర లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని నియమించారు జగన్..ఇప్పుడు తిరిగి విజయసాయిరెడ్డిని నియమించడం పట్ల ఎమ్మెల్సీ.. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
ఎవరి వల్ల అయితే ఉత్తరాంధ్రలో వైసీపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహాంగా ఉన్నారో మళ్లీ వాళ్లకే బాధ్యతలు అప్పజెప్పడం నచ్చడంలేదని బొత్స తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారంట . ఉత్తరాంధ్ర కు కావాల్సింది రెడ్డి నాయకత్వం కాదు బీసీ నాయకత్వం అనే నినాదాన్ని అక్కడ వైసీపీ శ్రేణులు లేవనెత్తుతున్నారంట. మరి ఈ అలజడి ఏటూ దారితీస్తుందో చూడాలి మున్ముందు..?