ముచ్చర్లనే రేపటి మరో మహానగరం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ సమీపంలోని ముచ్చర్లలో నిర్మించే ఫార్మా సిటీతో పాటు పలు కంపెనీలను తీసుకోస్తాము.. భవిష్యత్తులో ముచ్చర్లనే రేపటి మరో మహానగరం అవుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” ముచ్చర్లలో ఫార్మా సిటీ,పరిశ్రమల కోసం భూసేకరణ జరుగుతుంది.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. పలు సంస్థలతో పాటు సిల్క్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాము.. స్పోర్ట్స్ యూనివర్సిటీతో పెట్టి క్రీడాకారులకు యువతకు శిక్షణ ఇప్పిస్తాము.. బీసీసీఐతో మాట్లాడి క్రికెట్ మైదానాన్ని నిర్మించడానికి ఒప్పించానని” ఆయన అన్నారు.