ఎంపీ మిథున్ రెడ్డికి జైలులో సదుపాయాలివే.!

Peddireddy Venkata Midhun Reddy
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచిన సంగతి తెలిసిందే. విచారించిన కోర్టు ఎంపీ మిథున్ రెడ్డి ఆగస్టు ఒకటో తారీఖు వరకు రిమాండ్ ను విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు.
జైలులో ఆయనకు టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా బయట నుంచి భోజనం, మంచం , దోమల తెర, యోగ మ్యాట్, వాకింగ్ షూస్, వార్తపత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారానికి ఐదు రోజులు ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు, రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్స్ వంటి సదుపాయాలను కల్పించాలని కోర్టును ఆయన కోరినట్లు తెలిసింది.