నల్గొండ  ప్రజలకు ఎంపీ విన్నపం

 నల్గొండ  ప్రజలకు ఎంపీ విన్నపం

Chamala Kiran Kumar Reddy Member of the Lok Sabha

రేపు హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో సాయంత్రం 4:00 గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేడు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ…ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత రైతన్నలకు నా నమస్కారం…

గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసీ ప్రక్షాళనను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన అనే బృహత్తర కార్యక్రమాని కి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే రైతుల సహకారం అవసరం, మీ అందరూ నడుంబిగించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతన్నలను కోరారు. రేపు హైదరాబాద్ నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో సాయంత్రం 4:00 గంటలకు జరిగే రైతుల సమావేశానికి ప్రతి ఒక్క రైతు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ మూసి జీవనది కింద తరతరాలుగా మనము వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాము.
పూర్వం ఎంతో ఘన చరిత్ర కలిగిన మూసీ నది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మించుకున్న ఈ నది నీరు సాగు, తాగు, పాడి,మత్స్య అవసరాలకు ఉపయోగపడేది.హైదరాబాద్, రంగారెడ్డి సహా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ప్రయోజనం కలిగేది.అంత గొప్ప చరిత్ర కలిగిన మూసీ నది నేడు మానవ తప్పిదాల వలన కాలుష్యమయంగా మారి దుర్గంధం వెదజల్లుతుంది.కలుషితమై పంటలు సరిగా పడడం లేదు, కొనే పరిస్థితి లేదని,పండిన పంటలను తినే పరిస్థితి లేదని అన్నారు.

ఈరోజు ప్రభుత్వం ఎస్టిపిలతో మురికి నీరును శుద్ధి చేసి గోదావరి జలాలతో నింపి, రైతులకు మంచినీరు అందించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుందని అన్నారు.మూసీ నదిని శుద్ధిచేసి పరివాహక ప్రాంత ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలని ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళుతుంటే,నేడు ప్రతిపక్షాలుకుట్రలు పన్ని అడ్డుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష నాయకులు రైతులను ప్రజలను తప్పుతో పట్టించి మూసి ప్రక్షాళన అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతిపక్షాల కుట్రలు తిప్పి కొట్టాలని కోరారు.

ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరైడ్ గుర్తుకొచ్చేది, ప్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న జనాలు కళ్ళముందు కనపడేది, అట్లాంటి ఫ్లోరైడ్ సమస్యని నివారించుకోగలిగినాము.నేడు మానవ తప్పిదాల వల్ల కాలుష్యం అయిన మూసీ నదిని శుద్ధి చేసుకోలేమా,రేపు జరిగే సమావేశానికి హాజరై ప్రభుత్వానికి మద్దతు పలకాలని రైతులను కోరారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *