మోహన్ బాబు లేఖలో ఏముంది..?
రాచకొండ సీపీకి ప్రముఖ తెలుగు సినిమా సీనియర్ నటుడు మోహాన్ బాబు ఓ లేఖ రాసిన సంగతి తెల్సిందే. అసలు ఆ లేఖలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాము. తాను హైదరాబాద్ లోని జల్ పల్లిలో గత పదేళ్లుగా ఉంటున్నాను..
ఇల్లువదిలి వెళ్లిపోయిన మనోజ్ 4నెలల కిందట తిరిగొచ్చారని రాచకొండ సీపీకి రాసిన లేఖలో మోహన్బాబు చెప్పారు. ‘అతను తన భార్య, మరికొందరితో కలిసి నన్ను ఇంటి నుంచి పంపాలని చూశాడు.
తన 7నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్లోని నా ఆఫీసు సిబ్బందిని 30మందితో బెదిరించాడు. నేను 78ఏళ్ల సీనియర్ సిటిజన్ని. రక్షణ కల్పించండి’ అని మోహన్ బాబు రాశారు.