మొబైల్ ఫోన్స్ ఏకాగ్రత లేకుండా చేస్తున్నాయి

 మొబైల్ ఫోన్స్  ఏకాగ్రత లేకుండా చేస్తున్నాయి

Mobile phones are distracting

4 total views , 1 views today

సిద్దిపేటలో జరిగిన ఉగాది ఉత్సవ వేడుకల్లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “ఈ విశ్వవాసు నామ సంవత్సరం అందరికీ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు శుభం కలగాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.పాత రోజుల్లో పంచాంగ శ్రవణానికి చాలా ప్రాధాన్యత ఉండేది. రాను రాను పత్రికలతో పాటు పంచాంగం కూడా వచ్చేస్తుంది. మన రాశిఫలాల ఆధారంగా చదువుకోవడం అలవాటయింది.

ప్రజలు చాలా ఆసక్తిగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది వర్షాలు పడతాయా, పంటలు పండుతాయా వారి జీవి తం ఎలా ఉంటుంది అని ఎంతో ఆసక్తితో చూసేవారం.ఇప్పుడు ఫోన్లోనే చూసుకోవడం బాగా అలవాటై పం చాంగ శ్రవణానికి కొంచెం ప్రాధాన్యత తగ్గింది. ఆచార సాంప్రదాయాలు కొనసాగాలి. దీనిని ముందు తరాల కు అందించే బాధ్యత మనందరిపై ఉంది.ఇక్కడ కూర్చున్న శివశర్మ గారు పంచాంగ శ్రవణం చెప్తుంటే వెనుక ముచ్చట్లు పెట్టే వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు. ఫోన్లు చూసేవారు ఫోన్ చేస్తున్నారు.

ఈ మొబైల్ ఫోన్స్ మనకు ఏకాగ్రత లేకుండా చేస్తున్నాయి. ఇది చాలా బాధాకరం.నరసింహ శర్మగారు గేయ రామాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. మీరు కోరిన విధంగా ఆధ్యాత్మికంగా సిద్దిపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం.మిమ్మల్ని చాలా గౌరవంగా సత్కరించి సన్మానించుకుంటాం.కేసీఆర్ గార గురించి అందరూ చెప్పారు. నిజంగా చెప్పాలంటే వారు బ్రాహ్మణ బంధువు.దేశంలో మొట్టమొదటిసారి బ్రాహ్మణ పరిషత్ ను సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. ఆరోజు ఎమ్మెల్యేగా బ్రాహ్మణ పరిషత్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా దేశంలోనే మొట్టమొదటిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.వారి సాధక బాధలు అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఉద్యోగాలతో పాటు అన్ని అవకాశాలు బ్రాహ్మణ పేదలకు దక్కాలని బ్రాహ్మణ సంక్షేమానికి పెద్ద పీట వేశారు.

బ్రాహ్మణులకు ఏవైతే కేసీఆర్ గారు చేశారో ఆ కార్యక్రమాలన్ని ఈ గవర్నమెంట్ కూడా కొనసాగించాలని కోరు తున్నాను.ఆలయాల్లోని హుండీలో డబ్బులు వస్తేనే పూజారులకు జీతం వచ్చే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుండి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ప్రతినెల మొదటి తేదీ దేవాలయ ఉద్యోగులకు జీతాలు వచ్చేలా చేశారు.యాదాద్రి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈసారి అధికారంలోకి వచ్చుం టే కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసేవారు.సిద్దిపేటలో కూడా బ్రాహ్మణ పరిష త్ దాదాపు కోటి రూపాయలు వెచ్చించి ఈ భవనాన్ని చక్కగా చేసుకున్నాం. వాస్తుకు ఇబ్బంది ఉందంటే పక్క నే ఉన్న ప్లాన్ ని తీసుకొని మరింత అభివృద్ధి చేసుకుందాం.ఇక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుం దాం. ధార్మిక కార్యక్రమాలకు నిలయంగా దీన్ని తీర్చిదిద్దుకుందాం.

దానికి ఏ సహకారం కావాలన్నా నేను అందిస్తాను. ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోదాం.కొన్ని సంద ర్భాల్లో పోలీసులు ప్రభుత్వాలు చేయలేని పని దేవుడి పేరుమీద ఎంతో క్రమశిక్షణతో చేస్తాం. పిల్లల జీవితంలో మార్పు చేయగలుగుతాం. చెడు అలవాట్లను దూరం చేయగలుగుతాం. మంచి క్రమశిక్షణ మార్గంలో ఆధ్యా త్మి కత నడిపిస్తుంది.పాత రోజుల్లో ఇంట్లో తిని సద్ది కట్టుకుని బయటకు వెళ్లేవారు. ఇప్పుడు బయట తిని కావలిస్తే డబ్బా కట్టుకుని ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది.ఒక గుణాత్మక మార్పు తేవాలంటే అది కేవలం ఆధ్యాత్మికత వల్లే సాధ్యమవుతుంది. సమాజాన్ని అటువైపుగా మనం నడిపించగలిగితే అందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉంటారు.

ఈ తరం పిల్లలు అభివృద్ధితో పోటీపడుతూ తెలుగు భాషను మర్చిపోతున్నారు. విదేశాల్లో ఉండే పిల్లలకు సాం ప్రదాయం, ఆచారాలను, పండుగలను చక్కగా నేర్పిస్తున్నారు.ఇక్కడ మనం మన సాంప్రదాయాన్ని, మన భా షను మర్చిపోతున్నాం.విదేశాల్లో ఉండే మన తెలుగువారు బతుకమ్మ ఆడుతున్నారు. బోనాలను తీస్తున్నా రు . వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నారు. మన సంప్రదాయాన్ని మన పండుగలను చక్కగా జరుపుకుంటు న్నారు.మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి కృషి చేద్దాం.సిద్దిపేటలో టీటీడీ ఆధ్వర్యంలో మరో వెంకటేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన చేయబోతున్నాం.పెద్ద జీయర్ స్వామి గారి చేతుల మీదుగా మన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించుకున్నాం. చిన్న జీయర్ స్వామి గారి చేతుల మీదుగా స్వర్ణో త్సవం జరుపుకోబోతున్నాం.చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400