YSRCP కి బిగ్ షాక్

YSR Congress Party
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.. ఆ పార్టీకి మహిళా నాయకురాలు.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు.
పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు పోతుల సునీత తెలిపారు. ప్రస్తుతం ఆమె మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని మీడియాకు వివరించారు.