ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం

BRS MLC KAVITHA
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ పాలిటిక్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ క్రమశిక్షణ నియమనిబంధనలకు విరుద్ధంగా పోకడను కొనసాగిస్తున్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.
అయితే తాను తన పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికీ కూడా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారనే లేఖ రాగానే ఎమ్మెల్సీ కవిత తన సన్నిహితులతో కల్సి బంజారాహిల్స్ లోని తన నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు నాలుగు ఐదు గంటల పాటు సుధీర్ఘ చర్చ అనంతరం తాను ఇటు పార్టీ సభ్యత్వానికి , అటు ఎమ్మెల్సీ పదవికీ సైతం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా తెలంగాణ బహుజన సమితి (టీఆర్ఎస్ ) పేరుతో కూడా కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు జాగృతి కార్యకర్తలు, నేతలు చెబుతున్నారు. వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే రేపు మధ్యాహ్నాం పన్నెండు గంటల వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత రేపు మధ్యాహ్నాం జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు.