ఎమ్మెల్సీ కవిత డ్రామాలు..!

MLC Kavitha dramas..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడి కలిసి ఏం మాట్లాడుకున్నారో ఏమో అక్కడైతే మూడో వ్యక్తి లేడు మరి ఎమ్మెల్సీ కవితకు ఎలా తెలిసిందో చెప్పాలని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ చర్చ నుండి బయటకు వచ్చాక అబాండాలు మోపుతున్నా రన్నారు. తెలంగాణ ప్రజలకు మీ వంతుగా అంటే రోజుకు ఒకరు మీ కుటుంబంలో నుండి మాట్లాడాలి కదా అన్నారు.
ఈరోజు మీ వంతుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా అన్నారు. టిఆర్ఎస్ పార్టీ గురించి నెగిటివ్ మాట్లాడు తున్నారని అంటున్నారు, బిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు కట్టుబడి ఉంటుంది అని చెప్తున్నారు కానీ మీరు తెలంగాణకు కట్టుబడి ఉండలే పది సంవత్స రాలలో తెలంగాణను పెట్టుబడిగా పెట్టి ఏడు లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు చేసి వేల కోట్లు దండుకొని విదేశాల్లో పెట్టుబడి పెట్టడమే మీరు తెలంగాణ కట్టుబడి ఉండడం అని తెలంగాణ ప్రజలకు మీ గురించి తెలిసిపోయిందని అన్నారు.
కాంగ్రెస్, బిజెపి కలిసి డ్రామాలు ఆడుతున్నాయి వాళ్ళిద్దరూ ఒకటే జట్టు అంటున్నారు కానీ ఎవరు ఎవరి జట్టు తెలంగాణ ప్రజలు చూశారన్నారు. 8 ఎంపి సీట్లు గెలవడానికి ఎవరికి ఎవరు ప్రోత్సహించిరు ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్స్ ను నిలబెట్టకుండా ఇంటర్నల్గా ఎవరికి సపోర్ట్ చేశారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చీమ చిటుక్కుమన్న మాట్లాడే మీరు, మీకు అత్యంత సన్నిహితుడు
గతంలో మీ అన్నగారైనటువంటి కెటిఆర్కి అన్ని విధాలుగా ఉన్నటువంటి వ్యక్తి దుబాయిలో మరణించినప్పుడు దాని గురించి ఖచ్చితంగా చర్చ వస్తుందని, ఒక మనిషికి దగ్గరగా వ్యవహారాలు నడిపి దగ్గరగా పెట్టుబడులను చూసుకొని ఆ రోజుల్లో ఉన్నటువంటి ఐ లైఫ్ పబ్బు లాంటి మేజర్ కార్యక్రమాలను హైదరాబాదులో నడిపినటువంటి వ్యక్తి మీకు అత్యంత సన్ని హితుడు అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసిన వ్యక్తి ఈరోజు దుబాయిలో చనిపోయాడు.
దాని గురించి విచారణ కావాలని, విచారణకు ఇస్తే బాగుం టుందని వాస్తవాలు తెలుసుకోవాలని లేదా అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయ డమే కాక మీరు ఢిల్లీకి వెళ్లి వ్యాపారం చేయాలనే పిచ్చి ఆలోచనతో అక్కడ కూడా ప్రభుత్వాన్ని కూల్చడం మీ వల్లనే జరిగిందన్నారు.
